GNTR: తెనాలి జీఆర్పీ ఎస్సై వెంకటాద్రి విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంగళవారం సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ముఖ్యంగా క్షణికావేశంలో రైళ్ల కింద పడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్, ఫ్రెండ్లీ పోలీసింగ్పై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.