GNTR: CM చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. బుధవారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తులో పెట్టబోయే భారీ పెట్టుబడులపై వారిరువురు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగాయి.