KRNL: కర్నూలు నగర వ్యాప్తంగా మురుగు కాలువల్లో పూడికతీత పనులు ముమ్మరం చేయాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం కృష్ణానగర్, బిర్లాకాపౌండ్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంతాల్లో కమిషనర్ విసృతంగా పర్యటించారు. మురుగు కాలువల్లో మురుగునీరు ప్రవాహానికి ఆటంకం లేకుండా పూడికతీత పనులు త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.