KRNL: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పోలీసులు, సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఆధార్ సమాచారం ఎవరికీ ఇవ్వవద్దని సూచించారు.