W.G: నరసాపురంలోని 26వ వార్డులో వీవర్స్ కాలనీలో నివాసాల మధ్య వైన్ షాప్ వద్దంటూ శనివారం కాలనీవాసులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. కాలనీకి సమీపంలో బాలికల గురుకుల పాఠశాల ఉందని, ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల ఆ బాలికలు, ఈ ప్రాంతవాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.