SKLM: ఆమదాలవలస పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు. దీంట్లో నియోజకవర్గ ప్రజలు పాల్గొని గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు.