ATP: రాయదుర్గం-తుమకూరు రైలు మార్గం నిర్మాణంలో భాగంగా దొడ్డహళ్లి-పావగడ నడుమ కొత్తగా నిర్మించిన 15.7 కిలోమీటర్ల సింగల్ లైన్ బ్రాడ్ గేజ్ రైలు మార్గాన్ని రైల్వే అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త ఢిల్లీ రైల్వే చీఫ్ కమిషనర్ జనక్ కుమార్ గార్గ్ ఈ మార్గంలో రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని, ప్రయాణ వేగాన్ని పరీక్షించారు.