E.G: గ్రామాల్లో నీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగంపేట MPDO కార్యాలయంలో బుధవారం సాయంత్రం RWS, పంచాయతీరాజ్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను చర్చించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.