SKLM: వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామంలో ఇవాళ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మత్స్యకారులకు ఇంజన్లు, వలలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదలైంది. మండలంలో దేవనల్తాడ, హుకుంపేట, నువ్వలరేవు, మంచినీళ్లపేట గ్రామాలకు చెందిన 17 మంది మత్స్యకారులకు వీటిని 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు.