VSP: జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 21న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు 90 అంశాలతో అజెండాను తయారుచేసి, సభ్యులకు పంపిణీ చేశారు. గత సమావేశం ఆగస్టు 22న జరిగిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా తప్పనిసరిగా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనే నిబంధనతో ఈనెల 21న ఏర్పాటుచేశారు.