E.G: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన PMAY–గ్రామీణ 2.0 పథకం అమలు చర్యలపై MLC సోము వీర్రాజు రాజమండ్రిలో హౌసింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ పేదలకు గృహాలను నిర్మించాలన్న సంకల్పంతో పీఎం నరేంద్ర మోదీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.