KDP: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి రోడ్లు, భూ ఆక్రమణలు, విద్యుత్, రెవెన్యూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మశాన స్థలాల ఆక్రమణలపై సర్వే చేయించాలని అధికారులను ఆదేశించారు.