ATP: అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం గ్రీవెన్స్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఛైర్మన్ టీసీ వరుణ్, వైస్‌ఛైర్మన్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గతంలో కంటే భిన్నంగా సమూల మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. అహుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్లాట్ల విక్రయానికి ఈ-యాక్షన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.