GNTR: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC)లో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం పశ్చిమ ఎమ్మెల్యే మాధవిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని కాంట్రాక్టర్లు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. తమ సమస్యలను వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.