ELR: బుట్టాయిగూడెం మండలం పల్లపూరు ఆర్అండ్ఆర్ కాలనీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మబంధువులం అనే సంస్థ ద్వారా గిరిజన విద్యార్థులకు, ప్రజలకు పలు వస్తువులు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పంతో రాజకీయల్లోకి వచ్చానన్నారు. త్వరలోనే చిర్రి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థను ఏర్పాటు చేస్తానన్నారు.