ATP: వజ్రకరూరు మండల రాగులపాడు వద్ద ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 13.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు పాల్తూరుకు చెందిన రుద్రన్న, నందీశ్వరలపై కేసు నమోదు చేశారు. అనంతరం బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్సై నాగ స్వామి తెలిపారు. రేషన్ అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.