VZM: చీపురుపల్లి శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి రవి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. సంకుపాలెం గ్రామానికి చెందిన భజన బృందం వారిచే అమ్మవారికి భక్తి గీతాలాపన అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్, వైస్ ఛైర్మన్ సూరు కుమార్ స్వామి పాల్గొన్నారు.