CTR: పుంగనూరు UNR సర్కిల్ నుంచి మదనపల్లి వైపు వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఉబేదుల్లా కాంపౌండ్‌కు చెందిన షావలి (28), ఆరిఫ్ (24) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనం ద్వారా పుంగనూరు ఏరియా హాస్పిటల్ తరలించారు. వైద్యులు చికిత్స నిర్వహించి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.