VZM: బొబ్బిలి గుణతోటవలస జగనన్న కాలనీ మిగులు స్థలాలు అక్రమంగా ఆక్రమించి విక్రయాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆదివారం ఆరోపించారు. రెవెన్యూ అధికారుల అండతో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు (LPC) ఇచ్చి లక్షల రూపాయలకు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని విమర్శించారు.