ELR: కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని పామిలేరు నది గట్టున సారా తయారీకి సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.శ్రీనుబాబు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై, సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.