SKLM: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వై.రామకృష్ణ తెలిపారు. సోమవారం పలాస సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో ట్రాఫిక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. స్థానికులు పోలీసులకు సహకరించాలన్నారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు.