NRML: సర్పంచ్ ఎన్నికలలో భాగంగా సోమవారం మామడ మండలంలోని పలు గ్రామాలలో మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లుర్తి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.