VZM: భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎర్ర బస్సు రాని గ్రామాలకు ఎయిర్ బస్ ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే అదే ప్రాంతానికి ఎయిర్ బస్ను తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.