E.G: పండుగ సెలవుల కోసం మీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఆభరణాలు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. నేరాల నియంత్రణ మరియు దొంగతనాల అరికట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. దొంగలు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.