TPT: తిరుపతి మార్కెట్లో నిమ్మ ధరలు పతనమైన నేపథ్యంలో రైతుబజార్ల ద్వారా నిమ్మ విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం తిరుపతిలోని రైతుబజార్‌కు 2 టన్నుల నిమ్మకాయలను కేటాయించి విక్రయించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశించారు.తిరుపతి రైతుబజార్లో నాణ్యమైన నిమ్మ కిలో రూ.20కి విక్రయించారు. తొలిరోజు 400కిలోలు అమ్ముడైనట్లు రైతులు తెలిపారు.