ATP: రాయదుర్గం మండలం కెంచానపల్లి గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి గ్రామంలో ఒక సామాజిక వర్గం వారు ఆవుల దేవర నిర్వహిస్తుండగా జరిగిన చిన్నపాటి ఘర్షణ కాస్త పెద్దదైంది.ఆ సమాజిక వర్గానికి చెందిన వారు,మరో సామాజిక వర్గం వారు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడ్డారు. గాయపడిన వారందరినీ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.