TPT: ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో ఓ చిన్నారికి కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో స్థానికుల్లో కలవరం రేపుతోంది. బుధవారం పదినెలల చిన్నారికి కరోనా సోకిందని కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పొందుపరచడంతో అధికారుల బృందం పరుగులు తీసింది. వివరాలు సేకరించాలని అన్ని గ్రామ సచివాలయాల సిబ్బందికి, వైద్యాధికారులకు సమాచారం అందించారు.