NDL: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బనగానపల్లె మండలం బత్తులూరుపాడు గ్రామం వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని ఆయన అన్నారు.