SKLM: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సోమవారం కవిసమ్మేళనం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి VVGS శంకరరావు మాట్లాడుతూ.. కవులు రాసిన కవిత్వాలను ఆకలింప చేసుకొని మంచి మార్గం వైపు పయనించాలన్నారు. రవి గాంచని చోట రవిగాంచాడని ఉన్న సూక్తి ప్రకారం రచయితలుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంగిపూడి శ్రీనివాసరావు, తంగి ఎర్రమ్మ కవులు పాల్గొన్నారు.