విశాఖ డీఆర్సీ సమావేశంలో ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పలు శాఖలపై కీలక సూచనలు చేశారు. టిడ్కో గృహ నిర్మాణాల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రి నారాయణల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలవరం నీరు అందుబాటులోకి వచ్చే నాటికి నిల్వ సామర్థ్యాలు పెంచాలన్నారు.