E.G: మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన నిమిత్తం సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఎమ్మెల్యే పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.