NTR: దసరాను పురస్కరించుకుని అమ్మవారి నవరాత్రుల పర్వదినాల్లో ఆయా అలంకరణలతో ప్రతి రోజు ఒక భక్తి పాటను యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తామని ఆధ్యాత్మిక గాయని గుడిపాటి శ్రీలలిత తెలిపారు. విజయవాడలో ఈ ఏడాది విడుదల చేయనున్న అమ్మవారి ఆధ్యాత్మిక భక్తి పాటల గురించి గాయని ఎం.ఎస్. సుబ్బలక్షి ముని మనవరాళ్లు సౌందర్య, ఐశ్వర్యతో కలిసి మీడియాకు ఆమె వివరాలు వెల్లడించారు.