ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు మండలంలోని 21 గ్రామపంచాయతీల TDP నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కావున అందరు తప్పక హాజరు కావాలన్నారు.