PPM: జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో గల రెల్లి వీధి సమీపంలో నాటుసారా భట్టీలు పై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు ఎస్సై అనిష్ తెలిపారు. నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని. ఎవరైనా సారా అమ్మిన, తయారుచేసిన అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు.