VSP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రియాంక శుక్రవారం డిమాండ్ చేశారు. విభజన చట్ట హామీలు, ప్రత్యేక హోదా, మెట్రో రైలు, జాతీయ విద్యాసంస్థలు, రైల్వే జోన్ వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్, ఉపాధి హామీలు కాగితం మీదే ఉన్నాయని, ఆడారి ఆనంద్ అవినీతి ఆరోపణలపై మాధవ్ మౌనం వహిస్తున్నారన్నారు.