NLR: సిద్దవటం మండలంలోని కనుములోపల్లి వద్ద శుక్రవారం అసిస్టెంట్ కమిషనర్ కారు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. కడప నుంచి భాకరాపేట వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించక బ్రేక్ వేయడంతో అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.