NLR: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ వర్షాలు తగ్గినప్పటికీ వరద నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాళంగి రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో సూళ్లూరుపేట వద్ద హైవే పక్కనే ఉన్న వట్రపాలెం పూర్తిగా మునిగిపోయింది. వరదని ముందుగానే అంచనా వేసిన అధికారులు వట్రపాలెం ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు. కొందరు ఇప్పటికీ గ్రామంలో ఉన్నారు.