E.G: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా రాజమండ్రిలోని వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.