TPT: తిరుమల శ్రీవారి హుండీ ద్వారా అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు ఆదాయం వచ్చింది అని టీటీడీ ప్రకటించింది. ఈ సమయంలో 22.77 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని, 1.23 కోట్ల లడ్డూలు విక్రయం కాగా, 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు అని తెలిపింది. కాగా, అదనంగా 8.31 లక్షల మంది తలనీలాలను స్వామివారికి సమర్పించారు అని స్పష్టం చేసింది.