GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ తెనాలిలో కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో గత శుక్రవారం మసీదుల వద్ద సంతకాల సేకరణ చేపట్టగా ఆదివారం చర్చిల వద్ద ఈ కార్యకమం నిర్వహించారు. బోసురోడ్డులోని టౌన్ చర్చి, చినరావూరులోని లూథరన్ చర్చిల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.