KRNL: చేరుకులపాడు నుంచి క్రిష్ణగిరి వెళ్లే రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. 10 కి.మీ మేర 12 భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ల కోసం రైతులు తవ్విన గుంతల వల్ల ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.