NLR: కందుకూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఇంద్రాణిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ శకుంతల సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అనారోగ్య కారణాలతో బాధ్యతల నుంచి తప్పించమని ఆమె కోరినట్లు తెలిసింది. దీంతో డాక్టర్ ఇంద్రాణిని అధికారులు నియమించారు. గతంలో కూడా ఆమె సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.