KDP: సిద్దవటం మండలంలోని సంటిగారిపల్లె గ్రామ సూచిక బోర్డు ముళ్ళ పొదల్లో దర్శనమిస్తుంది. కొత్త వ్యక్తులు గ్రామంలోకి వెళ్లాలంటే తికమక పడుతున్నారు. గత కొద్ది నెలలుగా గ్రామ సూచిక బోర్డు ఇలాగే ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆర్.అండ్.బి అధికారులు చర్యలు తీసుకొని ముళ్లపొదలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.