KDP: కొండాపురం మండల కేంద్రంలో ఆధార్ సేవా కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆధార్ కోసం మండలంలో ఉన్న ఎర్రగుడి సచివాలయానికి, సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని కొండాపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ నమోదుకు సిబ్బందిని నియమించి, నిరంతర సేవలు అందించాలని అధికారులను కోరుతున్నారు.