KRNL: తాత స్వాతంత్య్ర సమరయోధుడు. అలుపెరగని పోరాటం చేశారు. తండ్రిరైతు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్నారు. తాను ప్రజాసేవలో తరించాలని సంకల్పించారు. ప్రభుత్వ కొలువుతో అది సాధ్యమని భావించి పెద్దకడబూరుకు చెందిన వెంకటరెడ్డి, పద్మజ దంపతుల కుమారుడు వంశీకృష్ణారెడ్డి. TGలో విడుదలైన గ్రూప్-1ఫలితాల్లో రాష్ట్ర 3వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యరు.