SKLM: ఎచ్చెర్ల మండలంలోని అజ్జరాం గ్రామంలో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ బోర శ్రీ నివాసరావు సోమవారం పేదలకు బట్టలు పంపిణీ చేశారు. తన తండ్రి, మాజీ సర్పంచ్ బోర తవిటినాయుడు జ్ఞాపకార్ధం గత 18 ఏళ్లుగా బట్టల పంపిణీ చేస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత బోర రాము, సోమేశ్వరరావు, అప్పలరాజు ఉన్నారు.