ELR: ఉంగుటూరు గ్రామంలోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి దేవస్థానం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు.