KKD: మాదక ద్రవ్యాలను అరికట్టాలని కోరుతూ.. SFI ఆధ్వర్యంలో కాకినాడ JNTU వద్ద బుధవారం రాత్రి SFI నాయకులు నిరసన తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరు జిల్లా పెంచలయ్యను గంజాయి మూకలు పట్టపగలు హత్య చేశారని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.