W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో 96 శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. ప్రస్తుతం ఆస్తి పన్ను 55, ఖాళీ స్థలాల పన్ను 65, నీటి పన్ను 35 శాతానికి చేరిందన్నారు. ఈ నెలాఖరులోపు పన్నులు చెల్లించే వారికి అపరాధ రుసుముపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజలు పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.