VZM: బొబ్బిలి మండలం పెంట గ్రామంలో నందెన్న సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నాగులచవితి సందర్భంగా నందెన్న ఉత్సవాలు జరపడం అనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగా శనివారం నందెన్న సంబరాలు నిర్వహించడంతో పెంట, పరిసర గ్రామాల ప్రజలు శ్రీగంగా గౌరీ సహిత నందీశ్వర పార్వతీపరమేశ్వరులకు పూజలు చేశారు.